: ఆ ఘటన నాలో కసి పెంచింది...టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ ను చేసింది: రూట్
2013-2014లో జరిగిన యాషెస్ సిరీస్ కు ఎంపిక కాకపోవడం తనను తీవ్రమనస్తాపానికి గురి చేసిందని ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జోయ్ రూట్ తెలిపాడు. అప్పుడే యాషెస్ కు ఆడి సత్తాచాటాలని బలంగా నిర్ణయించుకున్నానని రూట్ వెల్లడించాడు. అదే కసితో ఆడుతున్నానని చెప్పాడు. ఈ కసే ఐసీసీ వరల్డ్ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టిందని రూట్ అభిప్రాయపడ్డాడు. కాగా, ఆస్ట్రేలియాతో నాటింగ్ హాంలో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టును ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 78 పరుగుల తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రూట్ ఒక్కడే 130 పరుగులు సాధించాడు. దీంతో 917 పాయింట్ల రేటింగ్ తో ఐసీసీ టెస్టు నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.