: విమానాన్ని హెలికాప్టర్ 'ఢీ' కొట్టింది


రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజధాని మాస్కో సమీపంలోని ఇస్త్రా రిజర్వాయర్ మీదుగా ప్రయాణిస్తున్న సెస్నా 206 అనే సముద్ర విమానాన్ని (సీ ప్లేన్) రాబిన్సన్ 44 అనే హెలికాప్టర్ శనివారం అర్ధరాత్రి 'ఢీ' కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఎనిమిది మంది మృతదేహాలను నేడు వెలికి తీశారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు, హెలికాప్టర్ పైలట్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మరో మృతదేహం కోసం అధికారులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News