: కిడ్నాపైన తెలుగువాళ్లు క్షేమం... త్వరలోనే తీసుకువస్తాం: సుష్మా స్వరాజ్


లిబియాలో కిడ్నాపైన తెలుగు వ్యక్తులు క్షేమంగానే ఉన్నట్టు తమకు సమాచారం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మిలిటెంట్ల చెరలోని ప్రొఫెసర్లు క్షేమంగానే ఉన్నారని, త్వరలోనే వారిని స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు. వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు. లిబియాలో భారత ఎంబసీ లేకపోవడం ప్రతికూలంగా మారిందని, అక్కడ అస్థిర ప్రభుత్వం ఉండడంతో తమ ప్రయత్నాలకు విఘాతం కలుగుతోందని సుష్మ విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News