: ఒరిజనల్ 'మున్నీ'ని కలిసేందుకు తహతహలాడుతున్న 'భజరంగీ భాయ్ జాన్'
మున్నీ అనే మూగ, బధిర బాలిక కోసం 'భజరంగీ భాయ్ జాన్' చేసిన సాహసాన్ని తెరపై చూశారు కదా? అయితే, సినిమాలోనే కాదు నిజజీవితంలోని 'మున్నీ' (గీత) కోసం కూడా ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నానని 'భజరంగీ భాయ్ జాన్' (సల్మాన్ ఖాన్) ప్రకటించాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి గత 15 ఏళ్లుగా పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న గీతను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. పాకిస్థాన్ నుంచి గీతను భారత్ తీసుకురావాలని ఉందని, అయితే ప్రభుత్వమే ఆ పని చేస్తున్నందున తానేమీ చేయడం లేదని స్పష్టం చేశాడు. అయితే గీతకు ఏదైనా చేయాలని ఉందని, ప్రభుత్వం అడిగితే ఏం చేసేందుకైనా సిద్ధమని సల్మాన్ తెలిపాడు. గీతను కలవాలని ఉందని, భారత్ రాగానే ఆమెను కలుస్తానని సల్మాన్ చెప్పాడు. గీత అడిగితే ఏం చేసేందుకైనా సిద్ధమని సల్మాన్ వెల్లడించాడు. కాగా, బాలీవుడ్ నటుల్లో సల్మాన్ కి ప్రత్యేకత ఉంది. ఆపదలో వున్న వాళ్లని సల్మాన్ అక్కున చేర్చుకుని ఆదుకుంటాడన్న పేరుంది.