: సీఎం చంద్రబాబుతోనే సాధ్యం... ఆయన రాజీపడలేదు: జూపూడి
ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబునాయుడు రాజీపడలేదని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అంటున్నారు. ఈ విషయంలో ఆయన కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయనపై నమ్మకంతోనే ప్రజలు కాంగ్రెస్, వైసీపీలను పక్కనబెట్టారని తెలిపారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఏనాడూ మాట్లాడని వైసీపీ, ఇవాళ పార్లమెంటు వెలుపల హైడ్రామాకు తెరదీసిందని విమర్శించారు. అవసరమైతే విభజన బిల్లుకు సవరణ చేసైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టీడీపీ కోరుతోందని జూపూడి తెలిపారు.