: ఆప్ మహిళా ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు


ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అల్కా లాంబాపై జరిగిన దాడి గురించి ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడడం వల్లే ఆమెపై దాడి జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే తెల్లవారు జామున, అర్ధ రాత్రి ప్రాంతాల్లో ఆమె చాందినీ చౌక్ ప్రాంతంలో కనిపించారని స్థానికులు చెబుతున్నారని, దీనిని బట్టి చూస్తే ఆమె డ్రగ్ అడిక్ట్ అని అర్థమవుతుందని, డ్రగ్స్ కి బానిస అయినందువల్లే రాత్రి సమయాల్లో తిరిగారని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ అరికట్టేవాళ్లు అంత రాత్రి వేళ తిరిగే అవసరం లేదని ఆయన సూత్రీకరించారు. ఈ సంఘటన అనంతరం లాంబాతో పాటు కేజ్రీవాల్ అనుచరులు దుకాణాలను తగులబెట్టారని, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే బీజేపీ కార్యకర్తలు లాఠీలతో ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. తనకు మహిళలంటే గౌరవమని, అయితే పూలన్ దేవి లాంటి వారిని చూపి మహిళా శక్తికి నిదర్శనం అంటే మాత్రం ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News