: విజయవాడ నుంచి పాలన సాగించాలని చంద్రబాబు నిర్ణయం... వసతుల ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ఏపీ ప్రభుత్వ పాలనను విజయవాడ నుంచి జరిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వారానికి నాలుగు రోజుల పాటు అక్కడి నుంచే పాలనా వ్యవహారాలు సాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17న నిర్వహించే కేబినేట్ భేటీ కూడా అక్కడే జరగనుంది.