: 'కాపీ అండ్ పేస్ట్'గాళ్లను పక్కన పెడతామంటున్న ట్విట్టర్!


ఎవరో, ఎక్కడో పెట్టిన జోకులను మీవిగా చెప్పుకుంటూ వందలకొద్ది 'లైకు'లు తెచ్చుకుని సంబరపడుతున్నారా? ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఎవరో పేజీల్లోని మెసేజ్ లను వారికి క్రెడిట్ ఇవ్వకుండా వాడుకుంటున్న 'కాపీ అండ్ పేస్ట్' గాళ్ల భరతం పడతామని ట్విట్టర్ చెబుతోంది. ఈ రకంగా జోకులు, కథలు తదితరాలు పంచుకున్న లక్షలాది మంది కంటెంట్ ను 'విత్ హెల్డ్'లో పెట్టింది. కొందరు కాపీరైటర్లు, కమేడియన్లు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ట్విట్టర్ ఈ చర్యలు తీసుకుంది. ఇకపై కూడా ఎవరైనా తమకు సంబంధించిన కంటెంట్ వేరేవారి పేరిట ఉన్నట్టు గమనిస్తే, సదరు సమాచారం తమదేనని తెలిపే ఆధారాలు అందిస్తే వాటిని నిలిపివేస్తామని చెబుతోంది.

  • Loading...

More Telugu News