: లండన్ లో దారితప్పిన రకుల్ ప్రీత్ సింగ్, భయంకర అనుభవమట!
లండన్ వీధుల్లో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తప్పిపోయింది. చిత్ర యూనిట్ ను కాసేపు ఆందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తయారవుతున్న చిత్రం షూటింగ్ లండన్ లో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా ఆమె ఒంటరిగా కారు నడుపుకుంటూ లండన్ వీధుల్లో తిరగాలి. ఆమె కారు ముందుభాగంలో కెమెరాను అమర్చగా, కొన్ని వీధుల గుండా వెళ్లి తిరిగి రావాల్సిన రకుల్ వెనక్కు రాలేదు. దారి తప్పి పోయి భయంకర అనుభవాన్ని ఎదుర్కొందట. వెంట సెల్ ఫోన్ తెచ్చుకోకపోవడంతో ఎవరిని కాంటాక్టు చేయాలో అర్థం కాక, కాసేపు ఆందోళనకు గురైందట. ఓ అరగంట తరువాత కారులోని వాకీటాకీ పనిచేయడంతో ఊపిరి పీల్చుకుని యూనిట్ ను కాంటాక్ట్ చేయడంతో వారు వచ్చి రకుల్ ను తీసుకెళ్లారు. తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయంకర అనుభవం ఇదేనని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.