: ప్రేమ జంటను ఒకటి చేసిన వైకాపా నేతలు
వైకాపా నేతలు పెళ్లి పెద్దలయ్యారు. ఇద్దరు ప్రేమికులను ఒకటి చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చింతూరులో నేడు జరిగింది. వివరాల్లోకి వెళితే, చింతూరు మండల పరిధిలోని మామిళ్లగూడెంకు చెందిన ప్రమీల, మారేడుమిల్లికి చెందిన శివప్రసాద్ లు గతంలో హైదరాబాదులోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకుందామని అనుకున్న సమయానికి శివప్రసాద్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. స్థానిక వైకాపా నేతలు వీరి తల్లిదండ్రులకు నచ్చజెప్పి పార్టీ ఆధ్వర్యంలో వివాహం జరిపించారు.