: భారత్, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
భారత్, పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దేశంలో శ్రీనగర్, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి. అటు ఆఫ్ఘనిస్తాన్, కజికిస్తాన్ సరిహద్దుల్లో, ఉత్తర పాకిస్థాన్, లాహోర్, ఇస్లామాబాద్ లో కూడా భూప్రకంపనలు వచ్చాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల ప్రాంతాల్లోనూ స్వల్ప భూకంపం వచ్చినట్టు తెలిసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది.