: మురళీ విజయ్ స్థానంలో కేఎల్ రాహుల్


శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టులో పాల్గొనే అవకాశం టీమిండియా వర్ధమాన ఆటగాడు కేఎల్ రాహుల్ దక్కించుకున్నాడు. ప్రాక్టీస్ లో టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ గాయపడడంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టులో రాహుల్ మెరుగైన ఆటతీరు ప్రదర్శించడంతో ఈ అవకాశం లభించింది. దీంతో శిఖర్ ధావన్ తో రాహుల్ టీమిండియా బ్యాటింగ్ ఆరంభించనున్నాడు. ఈ నెల 12న గాలెలో శ్రీలంక, టీమిండియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. కాగా, రెండో టెస్టుకల్లా విజయ్ ఫిట్ నెస్ సంపాదించుకుంటే, రెండో టెస్టులో ఆడే అవకాశం ఇస్తామని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆసీస్ తో జరిగిన సిరీస్ లో మురళీ విజయ్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News