: పార్లమెంట్ ముట్టడికి కదిలిన వైకాపా శ్రేణులు, జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత

ప్రత్యేక హోదాను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంట్ ముట్టడికి జగన్ సహా వైకాపా నేతలు, సుమారు 4 వేల మందికి పైగా కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు వైకాపా నేతలకు బారికేడ్లు పెట్టి అడ్డుగా నిలబడి వేదిక దాటకుండా చూస్తున్నారు. దీంతో వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వైకాపా నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వరకూ నేతలు బయలుదేరవచ్చని ముందుగానే ఊహించిన ఢిల్లీ పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎవరూ పార్లమెంట్ రోడ్ లోకి వెళ్లకుండా చూస్తున్నారు.