: ఇలాగే ఉంటే తెలంగాణ 'రైతు ఆత్మహత్య'ల్లో నెంబర్ వన్ అవుతుంది: కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ
పరిస్థితులన్నీ ఇలాగే ఉంటే రైతు ఆత్మహత్యల్లో నెంబర్ టూగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, నెంబర్ వన్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో హెచ్చరించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం అందజేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల నివారణకు తెలంగాణలో ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన లేఖలో తెలిపారు. కరవు నివారణకు అవసరమైన చర్యలు చేపట్టలేదని ఆరోపించిన ఆయన, ఇప్పటికైనా కరవు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గతేడాది కూడా కేంద్రానికి కరవు నివేదికలు పంపలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన బహిరంగ లేఖలో సూచించారు.