: లిబియాలో కిడ్నాపైన తెలుగువారి విడుదలకు చర్యలపై ప్రధాని హామీ


లిబియాలో ఉగ్రవాదుల కిడ్నాప్ కు గురై బందీలుగా ఉన్న తెలుగువారు గోపీకృష్ణ, బలరాం కుటుంబసభ్యులు ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. టీడీపీ ఎంపీలు మల్లారెడ్డి, రామ్మోహన్ నాయుడు నేతృత్వంలో వారు ప్రధానితో మాట్లాడారు. స్పందించిన ప్రధాని... కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ తో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటానని చెప్పారు. ఉగ్రవాదుల చెర నుంచి వారిని విడిపించేందుకు కృషి చేస్తానని మోదీ హామీ ఇచ్చారు. అంతకుముందు వారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కూడా కలిశారు. తమ వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News