: న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై 'భద్రకాళి'


అమెరికాలోని ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ రౌద్రరూపం సంతరించుకుంది. ఎలాగంటారా?... ఈ 102 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఓ కాళికాదేవి చిత్రాన్ని ప్రొజెక్ట్ చేశారు. న్యూయార్క్ లో బుధవారం రాత్రి ప్రొజెక్టర్ సాయంతో ఆ శక్తి స్వరూపిణి చిత్రాన్ని ఆకాశమంత ఎత్తున ఆవిష్కరించారు. ఈ భద్రకాళి చిత్రాన్ని ఆండ్రూ జోన్స్ అనే ఆర్టిస్టు రూపొందించాడు. 'రుద్రకాళి' ప్రొజెక్షన్ అద్భుతాన్ని న్యూయార్క్ వాసులు, పర్యాటకులు ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో పంచుకున్నారు. ఆకాశంలో కాళికాదేవి ప్రత్యక్షమైందా? అన్న భ్రాంతిని కలిగించేలా ఈ ప్రొజెక్షన్ ఉండడం విశేషం. కాలుష్యం, వినాశనం తదితరాలపై పోరాడేందుకు ప్రకృతికి ఓ భీకరమూర్తి అవసరం అన్న కోణంలో ఈ కాళికామాత కాన్సెప్ట్ రూపొందించారు. అంతకుముందు, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై... అంతరించిపోతున్న ప్రాణులు, అమెరికా డెంటిస్టు బాణాలకు ప్రాణాలు వదిలిన సింహం సెసిల్ ను కూడా ప్రొజెక్ట్ చేశారు.

  • Loading...

More Telugu News