: శ్రీశైలం డ్యామ్ గ్యాలరీలో షార్ట్ సర్క్యూట్... కాలిపోయిన మోటార్లు!
ఈ మధ్యాహ్నం శ్రీశైలం సమీపంలో కృష్ణానదిపై ఉన్న డ్యామ్ కు పెను ప్రమాదం తప్పింది. డ్యామ్ గ్యాలరీలో ఉన్న మోటార్లన్నీ కాలిపోయాయి. ఆ సమయంలో సీకేజ్ వాటర్ చాలా తక్కువగా ఉండటంతో ఆనకట్టకు పెద్ద ప్రమాదం తప్పింది. గ్యాలరీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే మోటార్లు కాలిపోయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్యామ్ సిబ్బంది స్పందించి మరమ్మతు పనులను ప్రారంభించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేనందువల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు విమర్శించారు.