: కాంగ్రెస్ మన భూమిని మనగ్గాకుండా చేసింది!: చంద్రబాబు నిప్పులు


గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని మన భూమిని మనగ్గాకుండా చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. తెదేపా 'నీ భూమి నీ పట్టా' అంటూ పేదల కోసం కష్టపడితే, కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా భూములను దోచుకుందని ఆయన ఆరోపించారు. ఈ ఉదయం విశాఖ జిల్లాలో 'మీ ఇంటికి మీ భూమి' కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఇకపై భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగేటప్పుడు రీసర్వే చేయాల్సిన అవసరం లేకుండా చూడటమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో, 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, పదవీ విరమణ వయసును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచామని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల్లో దళారుల ప్రమేయం లేకుండా చూస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News