: వ్యక్తిగతంగా పోర్నోగ్రఫీ వీక్షించడంపై నిషేధం లేదు: కేంద్ర ప్రభుత్వం
వ్యక్తిగతంగా పోర్నోగ్రఫీ చూసుకునే విషయంలో ఎలాంటి నిషేధం విధించడం లేదని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. "వ్యక్తిగతంగా పోర్నోగ్రఫీ చూసే విషయంలో ఓ వ్యక్తి హక్కుకు ప్రభుత్వం మద్దతిస్తుంది" అని కేంద్రం తరపు వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ తెలిపారు. ఇటీవల అశ్లీల వెబ్ సైట్లను ప్రభుత్వం నిషేధించడంపై దాఖలైన పిటిషన్ లపై సుప్రీంలో విచారణ జరిగింది. పిల్లలకు సంబంధించిన వెబ్ సైట్లను తప్పకుండా నిషేధించాల్సి ఉంటుందని రోహత్గీ వెల్లడించారు. అయితే ప్రజల పడక గదుల్లోకి ప్రభుత్వం ప్రవేశించబోదని స్పష్టం చేశారు. కానీ, అశ్లీల వెబ్ సైట్లను నిషేధించడం పట్ల సమాజంలోగానీ, పార్లమెంట్ లో గానీ భారీ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. గత వారం 850 పోర్న్ సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దాంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.