: పాక్ ఎయిర్ పోర్టులో సుఖ్ బీర్ సింగ్ నిలిపివేత... పరారైన ఇండియన్ పాప్ సింగర్


పాకిస్థాన్ ఎయిర్ పోర్టులో ఇండియన్ పాప్ సింగర్ సుఖ్ బీర్ సింగ్ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. పాకిస్థాన్ లోని కరాచీ నుంచి దుబాయ్ వెళ్లేందుకు అక్కడి విమానాశ్రయానికి చేరుకున్న సుఖ్ బీర్ సింగ్ ను అక్కడి కస్టమ్స్ అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో జరిగిన తనిఖీల్లో సుఖ్ బీర్ వద్ద రూ. 27 వేల అమెరికన్ డాలర్ల మేర కరెన్సీ పట్టుబడింది. దీంతో అతడిని పాక్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత సుఖ్ బీర్ సింగ్ పాక్ అధికారులకు మస్కా కొట్టి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడట. సుఖ్ బీర్ అదృశ్యంపై పాక్ పత్రికలు పలు కథనాలు రాశాయి.

  • Loading...

More Telugu News