: పార్టీ ఉనికిని కాపాడుకోడానికే జగన్ ధర్నా చేస్తున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో చేస్తున్న దీక్షపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు. చచ్చిపోయిన పార్టీ ఉనికిని రాష్ట్రంలో మళ్లీ బతికించుకునేందుకే ధర్నా చేస్తున్నారన్నారు. ఏపీకి జరిగిన నష్టంపై విభజన అనంతరం ఒక్కసారి కూడా మాట్లాడని జగన్ ఇప్పుడు హోదాపై దీక్ష చేయడమేంటని మీడియాతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదంతా కేవలం రాజకీయ డ్రామా అని మంత్రి వ్యాఖ్యానించారు. దానివల్ల ఒరిగేదేమీ లేదన్నారు. వైసీపీ, కాంగ్రెస్ లు కలసి వారి స్వార్థం కోసం నాటకాలాడుతున్నాయని ఆయన విమర్శించారు.