: పదేళ్ల హోదా కావాలని రాజ్యసభలో నాడు వెంకయ్య అడిగారు కదా?: వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖండించారు. జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షలో ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో నాడు ప్రత్యేక హోదాపై బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ మాట్లాడారన్నారు. ఏపీకి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వెంకయ్య అడిగారని గుర్తు చేశారు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అంశం చట్టంలోనే లేదని అనడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదా రాకపోవడానికి బీజేపీతో పాటు కాంగ్రెస్, టీడీపీలు ప్రధాన కారణమని జగన్ తీవ్రంగా ఆరోపించారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు మాట్లాడకపోవడానికి కారణం ఏమిటని అడిగారు.

  • Loading...

More Telugu News