: భారత్ లో వెలువడుతున్న వార్తా పత్రికలెన్నో తెలుసా?
భారత దేశంలో ప్రచురితమవుతున్న వార్తా పత్రికలెన్నో చెప్పండి అంటే.. ఠక్కున సమాధానం చెప్పడం కాస్తంత కష్టమే. ఎందుకంటే, దేశంలో ప్రచురితమవుతున్న పత్రికలు వందో, వెయ్యో కాదు... ఏకంగా లక్ష దాటేసిందట. భారత వార్తా పత్రికల రిజిస్ట్రార్ (ఆర్ఎన్ఐ) గణాంకాల ప్రకారం 2013 మార్చి నాటికి 94,067 వార్తా పత్రికలు ఉన్నాయి. ఈ సంఖ్య ఈ ఏడాది మార్చి నాటికి లక్ష దాటిపోయిందట. ప్రస్తుతం దేశంలో 1,05,443 పత్రికలు వెలువడుతున్నాయని ఆర్ఎన్ఐ అధికారికంగా ప్రకటించింది. ఇక అత్యధిక సంఖ్యలో వార్తా పత్రికలు వెలువడుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశేనట. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 16,130 వార్తా పత్రికలు వున్నాయి. 14,394 వార్తా పత్రికలతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే...ఏపీలో 6,215 పత్రికలు వెలువడుతుండగా, కొత్త రాష్ట్రం తెలంగాణలో 203 పత్రికలు మాత్రం చెలామణిలో ఉన్నాయట.