: బాబు వస్తే జాబు రాలేదు... రాష్ట్రాలకు ‘హోదా’ సైతం పోయింది: వైసీపీ నేత పార్ధసారథి ఆరోపణ


బాబు వస్తే జాబు వస్తుందన్న టీడీపీ హామీలు కల్లలయ్యాయని వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రబాబు అధికారంలోకి వస్తే జాబు వచ్చే మాట దేవుడెరుగు... రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించే ప్రత్యేక హోదాకు కేంద్రం మంగళం పాడింది’’ అని ఆయన విమర్శించారు. 1969 నుంచి అమలవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటన చంద్రబాబు చేతగానితనం వల్లనే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని పార్థసారథి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే దాకా తాము పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News