: పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభం... లోక్ సభకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలు
పార్లమెంట్ ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఝార్ఖండ్ దేవ్ గడ్ తొక్కిలాట మృతులకు లోక్ సభలో సంతాపం తెలిపారు. ఐదు రోజుల సస్పెన్షన్ అనంతరం కాంగ్రెస్ ఎంపీలు సమావేశాలకు ఈరోజు హాజరయ్యారు. అయితే ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. లలిత్ మోదీ, సుష్మా స్వరాజ్ అంశంపై కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి పట్టుబట్టగా స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల తరువాత అనుమతి ఇస్తానని తెలిపారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అటు రాజ్యసభలో కూడా కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.