: మునికోటి ఆశయ సాధన కోసం పోరాడతాం... చెన్నైలో చిరంజీవి ప్రకటన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసుకున్న మునికోటి ఆశయ సాధన కోసం పోరాడతామని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ప్రకటించారు. తిరుపతిలో ఆత్మహత్యాయత్నం చేసి, చెన్నై కేఎంసీ ఆసుపత్రిలో కన్నుమూసిన మునికోటి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో కలిసి కొద్దిసేపటి క్రితం చెన్నై చేరుకున్న చిరంజీవి అక్కడ మీడియాతో మాట్లాడారు. మునికోటి ఆత్మహత్య తమను తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు.