: అంతరిక్ష కేంద్రంలో నేడు రష్యన్ వ్యోమగాముల స్పేస్ వాక్... నాసా ప్రత్యక్ష ప్రసారం


రష్యన్ వ్యోమగాములు ఈ రోజు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 188వ సారి స్పేస్ వాక్ చేయబోతున్నారు. ఈ రాత్రి 7.44 గంటల నుంచి స్పేస్ వాక్ మొదలవుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఎక్స్ పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ఫ్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకోలు స్పేక్ వాక్ లో పాల్గొంటున్నారని చెప్పింది. సుమారు ఆరు గంటల పాటు చేసే ఈ స్పేస్ వాక్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు నాసా తెలిపింది. కొత్త పరికరాలను అమర్చేందుకు, ఐఎస్ఎస్ బాహ్య భాగాన్ని పరీక్షించేందుకు స్పేస్ వాక్ చేయనున్నట్టు నాసా పేర్కొంది. గతంలో ఎక్కువకాలం ఐఎస్ఎస్ లో గడిపిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన పడల్కా... ఇలా పదవసారి స్పేస్ వాక్ చేస్తుండటం విశేషం.

  • Loading...

More Telugu News