: మా మూలాలపైనే అనుమానాలా?: మోదీకి నితీష్ ఘాటు కౌంటర్


గయ పరివర్తన్ ర్యాలీలో భాగంగా ప్రధాని మోదీ చేసిన విమర్శలపై జనతాదళ్-యునైటెడ్ నేత నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. బీహారులో ఆటవిక రాజ్యం నడుస్తోందని, అసలు ఇక్కడి వారి డీఎన్ఏలోనే తేడా ఉందని మోదీ వ్యాఖ్యానించగా, "బీహార్ లోని 50 లక్షల మంది ప్రజలు తమ డీఎన్ఏ శాంపిల్స్ పంపుతారు, పరీక్షించుకోండి" అని ట్వీట్ చేశారు. "డీఎన్ఏలో తేడా ఉంది" అని ఆయన చేసిన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని నితీష్ డిమాండ్ చేశారు. దీనికోసం 'శబ్దవాపసీ' పేరిట ప్రత్యేక ప్రచారం నిర్వహించి 50 లక్షల మంది సంతకాలు సేకరించనున్నామని ఆయన అన్నారు. తమ మూలాలపై అనుమానాలుంటే, గతంలో తమతో కలసి ఎందుకు పనిచేశారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News