: లక్ష్మారెడ్డీ... ఈ ప్రశ్నకు బదులేది?: రేవంత్ రెడ్డి
తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి విద్యార్హతల వివాదాన్ని మరింత వేడెక్కిస్తూ, తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కొత్త ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి చదువు ఎంబీబీఎస్ కు తక్కువ, ఆర్ఎంపీకి ఎక్కువ అన్నట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష్మారెడ్డి చెప్పినట్టు కర్ణాటక ఎడ్యుకేషన్ సొసైటీలో చదివి ఉన్నట్లయితే, ఆ సంస్థకు 1988లో మాత్రమే గుర్తింపు లభించిందని, అటువంటప్పుడు దానికన్నా ఒక సంవత్సరం ముందుగానే, 1987లో హోమియోపతి డిగ్రీ ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో లక్ష్మారెడ్డి ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రాక్టీస్ ప్రారంభించే ముందు ఎక్కడైనా రిజిస్టర్ చేశారా? అని కూడా రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాగా, తన విద్యార్హతలు బోగస్ అని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని లక్ష్మారెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.