: ఏపీ ప్రజాప్రతినిధుల్లో ర్యాంకుల గోల... ఎవరు కలిసినా ఇదే చర్చ!
తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తూ, సర్వే చేయించిన అనంతరం చంద్రబాబునాయుడు ఇచ్చిన ర్యాంకులు వారిలో కొత్త గుబులును పుట్టించాయి. ప్రస్తుతం ఏ ఇద్దరు నేతలు కలిసినా వారి మధ్య ఇదే అంశం చర్చకు వస్తోంది. అసలు ఏ ప్రాతిపదికన ర్యాంకులు ఇచ్చారు? నియోజకవర్గాల్లో పథకాల పనితీరు మదింపు ఎలా జరిగింది? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబు చేయించిన సర్వే తరువాత, సదరు ప్రజాప్రతినిధి పనితీరుపై ప్రజల అభిప్రాయంతో పాటు, జిల్లాలో అతని ర్యాంకు ఎంతన్న విషయాన్ని ప్రతిఒక్కరికీ వ్యక్తిగతంగా అందించిన సంగతి తెలిసిందే. ర్యాంకులు తక్కువగా వచ్చిన వారు అసలెందుకిలా జరిగిందో తెలియడం లేదని వాపోతున్నారు. నియోజకవర్గాల్లో ఓ పథకం సక్రమంగా అమలు కావడం లేదంటే, ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకోవడం లేదని అధినేత భావిస్తున్నట్టు అనుకోవాలని, వారు కల్పించుకుంటే, పథకం అమలు మరికొంత మెరుగు పడుతుందని బాబు భావిస్తున్నారని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పలువురు తెదేపా నేతలు తమ తమ అసెంబ్లీల్లో వివిధ పథకాల పనితీరుపై ఆరాలు మొదలు పెట్టారని సమాచారం.