: ఒక్కసారి మా ఫోటో చూపించండి, గుర్తు పడుతుంది... పాక్ లోని గీత తమ కూతురేనంటున్న తెలంగాణ దంపతులు
13 సంవత్సరాలుగా పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న యువతి గీత తమ కుమార్తేనని, గతంలో గుంటూరు జిల్లాలో జరిగిన సువార్త సభల సమయంలో తప్పిపోయిందని ఖమ్మం జిల్లా, జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర కృష్ణయ్య, గోపమ్మ దంపతులు చెబుతున్నారు. గీత తమను చూస్తే గుర్తుపడుతుందని, తమ ఫోటోలు ఆమెకు చూపాలని వారు వేడుకుంటున్నారు. తమ కుమార్తె పేరు రాణి అని, నుదుటిపై పుట్టుమచ్చ ఉందని, చేతులకు పులిపిర్లు ఉన్నాయని, కొద్దిగా మెల్లకన్ను కూడా ఉందని వారు చెబుతున్నారు. తాము టీవీల్లో చూసిన గీతకు, తమ బిడ్డ రాణికి పోలికలు ఉన్నాయని, అవసరమైతే డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమని వారు వివరించారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి గీత తమ బిడ్డంటే తమ బిడ్డని పలువురు తల్లిదండ్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.