: తిరుమల బస్సులకు మినహాయింపు... తిరుపతిలో నిలిచిన ప్రజా రవాణా


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ఆత్మబలిదానం చేసిన మునికోటి ఉదంతంతో తిరుపతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మునికోటి బలిదానానికి సంతాపంగా కాంగ్రెస్ పార్టీ నేడు తిరుపతిలో బంద్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వామపక్షాలు కూడా బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. నేటి ఉదయమే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బంద్ ను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు మినహా నగరంలో ప్రజా రవాణా పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News