: విశాఖకు చంద్రబాబు... ‘ఏపీ మేడ్’ జియోమీ ఫోన్లను ఆవిష్కరించనున్న సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు విశాఖలో పర్యటించనున్నారు. ‘ఏపీ మేడ్’ జియోమీ సెల్ ఫోన్లను ఆయన లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ లో చైనా మొబైల్ తయారీ దిగ్గజం జియోమీ కొత్తగా తన ప్లాంట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన జియోమీ, అతి తక్కువ కాలంలోనే తొలి ఉత్పత్తిని బయటకు తీసింది. ఈ ఫోన్లనే నేడు చంద్రబాబు మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.