: నేటి నుంచి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్... హ్యాట్రిక్ పై సైనా నెహ్వాల్ గురి!


ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇండోనేసియా రాజధాని జకార్తా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే భారత క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారు. భారత స్టార్ ప్లేయర్, హైదరాబాదీ అమ్మాయి సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పలు టోర్నీల్లో సత్తా చాటిన సైనా, ఈసారైనా టైటిల్ చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో బరిలోకి దిగుతోంది. ఇప్పటిదాకా ఈ టోర్నీలో ఐదు సార్లు పాల్గొన్న సైనా, ఒక్కసారి కూడా క్వార్టర్స్ దాటలేకపోయింది. సైనాతో పాటు కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధూలపైనా భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పల జోడీ కూడా మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News