: చంద్రబాబును పూర్తిగా నమ్ముతున్నా: జేసీ దివాకర్ రెడ్డి
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబే బెస్ట్ అని టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. ఆయనకున్న మేధాశక్తి, పరిచయాల వల్లే ఇతర రాష్ట్రాల కన్నా ఏపీకే ఎక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు. అయితే, ఇంతకు ముందు చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు కొంత తేడా ఉందని... ఇప్పుడు ఆయన కొంత మెతక వైఖరి అవలంబిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ మంచితనం పనికిరాదని చెప్పారు. చంద్రబాబు పట్టిసీమ చేపడతారని తాను కూడా ఊహించలేకపోయానని చెప్పారు. పట్టిసీమ గొప్ప ప్రాజెక్ట్ అని కితాబిచ్చారు. పట్టిసీమ నీటిని కృష్ణా బ్యారేజీకి తరలించి... శ్రీశైలం నీటిని రాయలసీమకు వినియోగించాలనేది చంద్రబాబు ఆలోచన అని చెప్పారు. ఓటుకు నోటు కేసు అసలు సమస్యే కాదని అన్నారు.