: రెండు రోజుల పాటు ఆర్టీసీ బస్సులోనే చిన్నారి శవం... ఎవరూ గుర్తించని వైనం


హృదయ విదారకమైన ఈ దారుణం ఈ మధ్యాహ్నం బయటపడింది. ఆర్టీసీ బస్సులోని వెనక సీటు కింద ఉంచిన ఓ సంచిలో చిన్నారి శవం బయటపడింది. ఈ చిన్నారి ఎవరో తెలియదు. ఎవరు చంపారో తెలియదు. బస్సులో ఎవరు ఉంచారో తెలియదు. శనివారం ఉదయం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక సీటు కింద ఈ చిన్నారి శవం ఉన్న సంచిని ఎవరో పెట్టి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత గోదావరిఖని నుంచి బస్సు భద్రాచలం వెళ్లింది. అక్కడే నైట్ హాల్ట్ అయింది. మరుసటి రోజు భద్రాచలం నుంచి తిరుగు పయనమయింది. వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. ఎక్కేవారు ఎక్కుతున్నారు... దిగేవారు దిగుతున్నారు. కానీ చిన్నారి శవాన్ని ఎవరూ గుర్తించలేదు. భద్రాచలంలో నైట్ హాల్ట్ సమయంలో కూడా డ్రైవర్ కాని, కండక్టర్ కానీ గమనించలేదు. ఈ మధ్యాహ్నం బస్సు వరంగల్ దరిదాపులకు వచ్చిన తర్వాత ఏదో దుర్వాసన వస్తున్నట్టు ప్రయాణికులు గుర్తించారు. ఈ క్రమంలో సీటు కింద ఉన్న చిన్నారి శవాన్ని చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారి శవానికి పోస్టుమార్టం నిర్వహింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News