: కలాం జ్ఞాపకాలతో నా మనసు బరువెక్కింది: రామోజీరావు
మన దేశానికి దొరికిన ఓ అపురూప రత్నం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని రామోజీ సంస్థల అధినేత రామోజీరావు కొనియాడారు. నిరంతరం పరిశోధనల్లోనే మునిగిన అవిశ్రాంత పరిశోధకుడు కలాం అని చెప్పారు. ఆయన జ్ఞాపకాలతో తన మనసు బరువెక్కిందని అన్నారు. భారతదేశం ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలకు జన్మనిచ్చిందని... అయితే, వారందరిలోకెల్లా కలాం అత్యున్నతమైన వ్యక్తి అని కితాబిచ్చారు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో అబ్దుల్ కలాం రచించిన 'ట్రాన్సెన్డెన్స్' పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.