: క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కు బెదిరింపులు


టీమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ లకు బెదిరింపులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, ఉత్తరప్రదేశ్ లోని బులంద్షార్ జిల్లా నివాసి రణవీర్ సింగ్ నుంచి రూ. 80 లక్షలకు వీరు భూమిని కొనుగోలు చేశారు. భూమి కొనుగోలుకు సంబంధించి మొత్తం డబ్బును నెట్ బ్యాంకింగ్ ద్వారా బదిలీ చేశారు. అయితే, రణవీర్ వీరి పేరిట భూమిని ట్రాన్స్ ఫర్ చేయలేదు. అంతేకాదు, డబ్బును తిరిగి ఇవ్వడానికి కూడా నిరాకరించాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కు, అతని తండ్రికి బెదిరింపులు వచ్చాయి. రణవీర్ సింగ్ ప్రస్తుతం ఓ హత్య కేసులో జైల్లో ఉన్నాడు. తమకు వచ్చిన బెదిరింపులపై భువనేశ్వర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, రణవీర్ తో పాటు మరో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు, భువనేశ్వర్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News