: తిరుపతిలో రేపు మునికోటి అంత్యక్రియలు
ఏపీ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి అంత్యక్రియలు రేపు తిరుపతిలో జరగనున్నాయి. రేపు ఉదయం అతని మృతదేహానికి చెన్నైలో పోస్టుమార్టం నిర్వహిస్తారు. అనంతరం అక్కడ నుంచి తిరుపతికి తరలిస్తారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, కోటి అంత్యక్రియలకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి, ఇతర కాంగ్రెస్ నేతలు, ప్రజా సంఘాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.