: కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టడం వల్లే మునికోటి ఆత్మహత్యకు పాల్పడ్డాడు: వర్ల రామయ్య
మునికోటి మరణానికి ఏపీ కాంగ్రెస్ నేతలే కారణమని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. అవగాహన లేని కాంగ్రెస్ నేతలు భావోద్రేకాలను రెచ్చగొట్టారని... అందువల్లే మునికోటి బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. దీనికి బాధ్యులైన ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపీలు చిరంజీవి, జేడీ శీలం, మాజీ మంత్రి శైలజానాథ్, తులసిరెడ్డి, సి.రామచంద్రయ్య తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి కాంగ్రెస్ పార్టీనే కారణమని... ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్న తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో వీరు చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.