: తనను తాను బతికించుకునేందుకు ప్రజల జీవితాలతో కాంగ్రెస్ చెలగాటమాడుతోంది: అచ్చెన్నాయుడు
అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ... ఇప్పుడు ఏపీలో తనను తాను బతికించుకునేందుకు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మొసలి కన్నీరు కారుస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఏ ఒక్కరూ లేరని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని... ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడరాదని విన్నవించారు. మునికోటి మరణం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో వైకాపా అధినేత జగన్ పై కూడా ఆయన మండిపడ్డారు. కేవలం రాజకీయ స్వార్థంతోనే ఢిల్లీలో జగన్ దీక్ష చేపడుతున్నారని ఆరోపించారు.