: భావోద్వేగాలకు లోను కాకండి... ప్రత్యేక హోదాపై ఆందోళన వద్దు: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎవరూ భావోద్వేగాలకు లోను కావద్దని, ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రత్యేక హోదా కోసం తాము పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు. ఇదే సందర్భంగా, ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన మునికోటి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి అఘాయిత్యాలకు ఎవరూ పాల్పడరాదని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తాను ఢిల్లీకి వెళుతున్నానని... అన్ని విషయాలను ప్రధాని మోదీతో చర్చిస్తానని తెలిపారు. ఏపీ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని కోరారు.

  • Loading...

More Telugu News