: బంగారు బోనం సమర్పించుకున్న కవిత
హైదరాబాదులోని పాతబస్తీలో వెలసిన సింహవాహిని అమ్మవారికి టీఆర్ఎస్ ఎంపీ కవిత బంగారు బోనం సమర్పించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అమ్మవారి దయవల్లే తెలంగాణ వచ్చిందని చెప్పారు. వర్షాలు బాగా కురిస్తేనే పంటలు బాగా పండుతాయని, ప్రజలంతా బాగుంటారని చెప్పారు. మరోవైపు, బోనాల సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీరంగంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. బోనాలతో భారీ ఎత్తున భక్తజనం అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు.