: ఓ అమరుడా! నీ త్యాగం ఊరికే పోదు: సినీ నటుడు శివాజీ
ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యాయత్నం చేసిన మునికోటి మరణించాడన్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. "ఓ అమరుడా! నీ త్యాగం ఊరికే పోదు. నీ మరణం లక్షలాది మందిలో కొత్త ఉద్యమానికి ఊపిరులూదుతుంది. కేంద్రం మెడలు వంచి హోదాను సాధించుంటాం" అని అన్నారు. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడరాదని ఆయన పిలుపునిచ్చాడు. బలిదానాలు వద్దని, పోరాడి హక్కులను సాధించుకుందామని అన్నారు. కోటి మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని శివాజీ తెలిపారు. కోటి కుటుంబానికి అండగా ఉంటామని వివరించారు.