: బాబు హయాంలో రాష్ట్రానికి ఎన్ని 'స్పెషల్ స్టేటస్'లో..!: రోజా వ్యంగ్యాస్త్రాలు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎన్నో విషయాల్లో ప్రత్యేక హోదాను సాధించేసిందని వైకాపా ఎమ్మెల్యే రోజా వ్యంగ్య విమర్శలు చేశారు. మహిళలపై దాడుల్లో, ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఓటుకు నోటు కేసులో రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ లభించిందని, ఈ ఘనత చంద్రబాబుదేనని ఆమె అన్నారు. కేసుల్లో ఇరుక్కున్న బాబు వాటి నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడుతూ, ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనబెట్టేశారని విమర్శించారు. ఎన్నికలకు ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా హోదాపై హామీలు ఇచ్చారని, ఆపై మోదీకి పీఎంగా, చంద్రబాబుకు సీఎంగా హోదాలు వచ్చినా, ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా రాలేదని దుయ్యబట్టారు. ఆనాడు బీజేపీ, టీడీపీలకు ఓటేస్తే మేలు కలుగుతుందని ప్రచారం చేసిన హీరో పవన్ కల్యాణ్ నేడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చట్టంలో సవరణ చేసి హోదాను తీసుకురావాల్సిన కేంద్ర, రాష్ట్ర నేతలు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News