: ఎంత దారుణం? ఒకేసారి 300 మందిని కాల్చి చంపిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఘోర దారుణానికి ఒడిగట్టారు. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 300 మంది ఇరాకీ పౌరులను దారుణంగా కాల్చి చంపారు. ఇరాక్ సుప్రీం ఎలక్టోరల్ కమిషన్ లో పనిచేస్తున్న వీరందరినీ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చంపేశారని అధికారులు తెలిపారు. మొత్తం ఉద్యోగులందరినీ తుపాకులతో కాల్చి చంపారని వివరించారు. నినెవెస్ ప్రావిన్స్ లోని మౌసూల్ లో 50 మంది మహిళలను కూడా ఉగ్రవాదులు చంపారని తెలిపారు. వెంటనే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కల్పించుకుని ఇరాక్ పౌరులను కాపాడాల్సిన అవసరం ఉందని కోరారు.