: బోనాల సందర్భంగా అమ్మవారిని వీహెచ్ ఏం మొక్కాడంటే..!


2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి మొక్కినట్టు ఆ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని కూడా అమ్మకు మొక్కినట్టు వివరించారు. టీఆర్ఎస్ కు అధికారం ఇచ్చి తప్పు చేసినట్టు తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మునిసిపల్ కార్మికుల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీలేనని, వీరిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

  • Loading...

More Telugu News