: పోలీసులు అరెస్ట్ చేసిన ఈ నెల్లూరోడు మహాముదురట!


తాను డీ-గ్యాంగ్ (దావూద్ ఇబ్రహీం) అనుచరుడినని, రూ. 100 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తామని బీసీసీఐ సభ్యుడు రాజీవ్ శుక్లాను బెదిరించిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ప్రధాన నిందితుడు, నెల్లూరు జిల్లాకు చెందిన ఫత్తే అహ్మద్ మహాముదురు క్యాండేట్ అని నిఘా వర్గాల విచారణలో వెల్లడైంది. గతంలోనూ ఎన్నోమార్లు ప్రజలను మోసం చేసిన అహ్మద్ విద్యాధికుడు కూడా. ఎంబీఏ పూర్తి చేసి రెండేళ్ల క్రితం ఓ ప్రముఖ ఫైనాన్స్ సంస్థకు గ్రూఫ్ ఫ్రాంచైజీ అంటూ, లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే, 10 లక్షల ఫైనాన్స్ ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చి 300 మందిని మోసం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. నగరంలోని ఓ కల్యాణ మండపం యజమాని రూ. 50 లక్షలు రుణం కావాలని వస్తే, ఐదు లక్షల రూపాయలు నొక్కేసినట్టు కూడా విచారణ అనంతరం పోలీసులు గుర్తించారు. అహ్మద్ గతంలో క్రికెట్ బెట్టింగ్ లు, రేసింగ్ లు వంటి అసాంఘిక కార్యకలాపాలు నడిపేవాడని, సినిమా హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లతో సంబంధాలున్నాయని గుర్తించిన విచారణ అధికారులు ఓ మైనార్టీ నేతతో అహ్మద్ కు దగ్గరి బంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ఈ దిశగా మరింత లోతైన విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ మహాముదురు జరిపిన నిర్వాకాలు ఇంకెన్ని బయటకు వస్తాయో!

  • Loading...

More Telugu News