: మరోసారి పేట్రేగిపోయిన ఉగ్రవాదులు... జవాను మృతి


పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉదయం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ సమీపంలోని తంగ్ధర్ సెక్టారులో భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. కొందరు ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు యత్నిస్తున్నారని గుర్తించిన సైన్యం వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా, ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగారు. అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు మొదలు పెట్టారు. ఈ కాల్పుల్లో ఒక జవాను వీరమరణం పొందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వివరించారు. ఎదురుకాల్పులు ఇంకా సాగుతున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News