: కాంగ్రెస్ పుట్టించిన కొత్త నినాదం... 'జై దక్షిణ తెలంగాణ'!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కోసం రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదాన్ని పుట్టించింది. నిన్న జరిగిన రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు 'జై దక్షిణ తెలంగాణ' అని నినాదాలు చేయడం కొత్త చర్చకు దారితీసింది. తెలంగాణలోని దక్షిణ జిల్లాల పట్ల కేసీఆర్ సర్కారు వివక్ష పాటిస్తోందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ప్రత్యేక దక్షిణ తెలంగాణ కోసం ఉద్యమం మొదలవుతుందని వారు హెచ్చరించారు.